×
Ad

Upasana: ఢిల్లీలో బతుకమ్మ సంబరాలు.. ముఖ్యమంత్రితో ఆడిపాడిన మెగా కోడలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ. తొమ్మిది రోజుల పాటు(Upasana) సాగే ఈ వేడుకలను తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.

Upasana Konidela celebrated Bathukamma festival with Delhi Chief Minister Rekha Gupta

Upasana: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకలను తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. అందుకే ప్రతీ ఏటా ఈ పండగను అట్టహాసంగా జరుపుకొంటారు తెలంగాణ ప్రజలు.సామాన్య జనాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తల్లిని ప్రార్థిస్తారు. ఎంతో ఉత్సాహంగ జరిగే ఈ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలోనూ జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఒక ప్రముఖ కళాశాలలో తెలుగు (Upasana)విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా పాల్గొన్నారు.

Thaman: మహేష్ ఫ్యాన్స్ అలా అనడం చాలా బాధేసింది.. డార్క్ రూమ్ లో ఏడ్చాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్

ఈ వేడుకల్లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి బతుకమ్మను నెత్తిన ఎత్తుకుని విద్యార్థులతో కలిసి సరదాగా ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి సంబందించిన ఫొటోలు, వీడియోలను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సోషల్ మీడియాలో పంచుకున్నారు. “బతుకమ్మ పండుగ అనేది కేవలం పూల ఉత్సవం మాత్రమే కాదు. మాతృత్వం, జీవనం, ప్రకృతి పట్ల మనకు ఉండే గౌరవానికి ప్రతీక. తెలంగాణ మహిళలు తరతరాలుగా జరుపుకుంటున్న, కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం సామాజిక, సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం. ఢిల్లీలో ఉన్న తెలుగు విద్యార్థులు కలిసి ఇలా వేడుకలు జరపడం రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలపరుస్తుంది” అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు ఢిల్లీయే సీఎం.