Upasana : చరణ్ విజయం వెనుక నేను కాదు.. నాకు సపోర్ట్‌గా చరణ్.. ఉపాసన కామెంట్స్..
రామ్ చరణ్ విజయం వెనుక నేను కాదు, నాకు సపోర్ట్‌గా చరణ్ అంటూ ఉపాసన కామెంట్స్.
- gum 95921
- Published On : December 28, 2023 / 04:04 PM IST
Upasana lovely post on Mega Power Star Ram Charan gone viral
Upasana – Ram Charan : మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిస్తున్నారు. ఇక ఈ ఇద్దరి లవ్లీ కపుల్ గురించి అందరికి తెలియజేయడానికి వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా వెర్షన్ లో రామ్ చరణ్ దంపతుల గురించి ఒక ప్రత్యేక ఆర్టికల్ వేశారు.
ఆ ఆర్టికల్ కవర్ పేజీ ఫొటోలో ఉపాసన సోఫాలో కూర్చోగా, రామ్ చరణ్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చోడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ మెగా కపుల్ గురించి కవర్ పేజీ పై ఇలా రాసుకొచ్చారు.. “సూపర్ కపుల్. వీరిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సినిమా సూపర్ స్టార్” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ నెట్టింట వైరల్ అవుతుంది.
Also read : Venky75 : వెంకీ మామ 75 ఫిలిమ్స్ సెలబ్రేషన్స్ ఈవెంట్ గ్యాలరీ..
ఇక ఆర్టికల్ గురించి ఉపాసన ఇలా పోస్ట్ వేశారు. “ప్రతి విజయం సాధించిన మగాడి వెనుక ఒక మహిళ ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు. కానీ నేను చెబుతుంది ఏంటంటే.. ప్రతి విజయం సాధించిన మహిళ వెనుక సపోర్ట్ గా, జాగ్రత్తగా చూసుకునే ఒక మగ వ్యక్తి కూడా ఉంటారు” అని ఆమె రామ్ చరణ్ గురించి పేర్కొన్నారు. ఇక ఈమె పోస్ట్ కి నెటిజెన్స్ రియాక్ట్ అవుతూ.. లవ్లీ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
They say, behind every successful man there is a woman.
I say, behind every successful woman there is a supportive & secure man. @AlwaysRamCharan @ForbesIndia pic.twitter.com/vtEtjZiedM— Upasana Konidela (@upasanakonidela) December 28, 2023
