Urvashi Rautela : ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పిన ఊర్వశి రౌటేలా.. ఆ ఫొటో వల్లే..
ఎన్టీఆర్ అభిమానులు ఊర్వశిని ట్రోల్ చేసారు.
- Saketh U
- Published On : April 16, 2024 / 09:27 AM IST
Urvashi Rautela says Sorry to NTR Fans Regarding to Selfie with NTR
Urvashi Rautela : ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం ముంబైలో వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నిన్న ఉదయం నటి ఊర్వశి రౌటేలా జిమ్‌లో ఎన్టీఆర్‌తో సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది. ఆ సెల్ఫీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ గురించి గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఆ సెల్ఫీ పోస్ట్ చేసేముందు ఫోటోని ఎడిట్ చేయడంతో ఎన్టీఆర్ చిన్నపిల్లాడిలా కనపడ్డారు ఆ సెల్ఫీలో.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఊర్వశిని ట్రోల్ చేసారు. ఫిల్టర్స్ ఎందుకు వాడావు? నువ్వు బాగా కనిపించాలని ఎన్టీఆర్ ని చిన్నపిల్లోడిని చేసేసావు అంటూ కామెంట్స్ చేసారు. కొంతమంది మీమ్స్ వేసి ట్రోల్ కూడా చేసారు ఊర్వశిని. దీంతో ఊర్వశి సారీ చెప్పింది.
తాను పోస్ట్ చేసిన ఎన్టీఆర్‌తో సెల్ఫీ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. సారీ.. ఈ ఫోటో తీయడానికి చైనీస్ ఫోన్ వాడాను అని పోస్ట్ చేసింది. చైనీస్ ఫోన్‌తో తీయడం వల్లే అలా ఫోటో వచ్చిందని ఊర్వశి చెప్పడం గమనార్హం. ఎంత చైనీస్ ఫోటో అయితే మాత్రం ఎలాంటి ఫిల్టర్స్ అప్లై చేయకుండా, ఎడిట్ చేయకుండా ఎన్టీఆర్ ఫేస్ మరీ అంతలా మారిపోతుందా? కానీ చివరకు సారీ చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అయినట్టు ఉన్నారు.
