NTR – Urvashi Rautela : ఎన్టీఆర్‌తో ఊర్వశి సెల్ఫీ వైరల్.. ఏం ఫిల్టర్స్ వాడావు అక్కాయ్.. ఎన్టీఆర్‌ని పిల్లోడిని చేసేసావు..

తాజాగా నటి ఊర్వశి రౌటేలా ఎన్టీఆర్ తో సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది.

NTR – Urvashi Rautela : ఎన్టీఆర్‌తో ఊర్వశి సెల్ఫీ వైరల్.. ఏం ఫిల్టర్స్ వాడావు అక్కాయ్.. ఎన్టీఆర్‌ని పిల్లోడిని చేసేసావు..

Urvashi Rautela shares Selfie with NTR Photos goes Viral Troll comments on Urvashi with Edited Photos

Updated On : April 15, 2024 / 2:14 PM IST

NTR – Urvashi Rautela : ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ ముంబైలో స్టైలిష్ గా ల్యాండ్ అయిన ఫొటోలు, వీడియోలు రెండు రోజుల క్రితం బాగా వైరల్ అయ్యాయి.

తాజాగా నటి ఊర్వశి రౌటేలా ఎన్టీఆర్ తో సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది. ఇవాళ ఉదయం జిమ్ లో ఎన్టీఆర్ ని కలవడంతో సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సెల్ఫీ ఫొటో షేర్ చేస్తూ.. చాలా గొప్ప, నిజాయితీ గల గ్లోబల్ సూపర్ స్టార్ ఎన్టీఆర్ గారిని కలిశాను. నాకు మోటివేషన్ ఇచ్చినందుకు థ్యాంక్యూ. మిమ్మల్ని పర్సనల్ గా చాలా ఆరాధిస్తాను. మీతో కలిసి వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసింది.

Also Read : Nayanthara : నయనతార క్యూట్ ఫ్యామిలీ ఫొటో చూశారా..? పండగ పూట ఫ్యామిలీతో సరదాగా..

ఎన్టీఆర్ తో ఊర్వశి సెల్ఫీ వైరల్ గా మారింది. అయితే జిమ్ టైంలో కాబట్టి ఊర్వశి మేకప్ లేకుండా ఉందేమో, లేదా ఫోటోని ఇంకా బాగా చూపించాలనుకుందేమో ఫోన్ లో ఫిల్టర్స్ వాడి ఫోటోని ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలో ఎన్టీఆర్ ఫేస్ చిన్నపిల్లాడిలా కనిపిస్తుంది. ఇంకేముంది అభిమనులు, నెటిజన్లు ఊర్వశి రౌటేలాని ఆడేసుకుంటున్నాడు. ఫిల్టర్స్ ఎందుకు వాడావు? ఏం ఫిల్టర్స్ వాడావు? నువ్వు బాగా కనిపించాలని మా అన్నని చిన్నపిల్లోడిని చేసేసావు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే ఊర్వశి వాడిన ఫిల్టర్స్ కి ఎన్టీఆర్ చిన్నపిల్లాడిలా కనపడటంతో సరదాగా మీమ్స్ వేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ తో పాటు ఊర్వశి రౌతేలా కూడా వైరల్ అవుతుంది.

ఆల్రెడీ ఊర్వశి ఐటెం సాంగ్స్ తో ఇప్పటికే తెలుగులో మూడు సినిమాల్లో నటించింది. మరి ఫ్యూచర్ లో ఎన్టీఆర్ సినిమాలో కూడా ఛాన్స్ వస్తుందేమో చూడాలి.