Ustaad Bhagat Singh Teaser: ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు.. దుమ్ములేపిన ట్రైలర్ టీజర్
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కొత్త టీజర్(Ustaad Bhagat Singh Teaser) విడుదల చేశారు మేకర్స్.
- V Santhosh Kumar
- Updated on- March 7, 2026 / 08:23 PM IST
ustaad bhagat singh new teaser out now
Ustaad Bhagat Singh Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ కాంబోలో చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh Teaser) సినిమా నుంచి కొత్త టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్ సరికొత్త అవతారంలో కనిపిస్తూ వచ్చిన ఈ టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది.
Thabitha Sukumar: స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్.. క్రేజీ ఫోటోలు వైరల్
ఇక ఇందాక విన్నది భగవత్ గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు అంటూ పవన్ చెప్పున డైలాగ్ అదిరిపోయింది. ఇక ఈ టీజర్ కి థమన్ అందించిన మ్యూజిక్ కూడా అదిరిపోయింది. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. మరి మీరు కూడా ఆ టీజర్ ను ఇక్కడ చూసేయండి.
