Ustaad Bhagat Singh OTT: ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?

ఓటీటీలో సందడి చేయనున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh OTT).

Ustaad bhagat singh ott streaming update

  • ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ పై క్రేజీ అప్డేట్
  • వచ్చే నెలలోనే ఓటీటీలోకి రానున్న మూవీ
  • ధురంధర్ 2 ఎఫెక్ట్ కారణం

Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. లేటెస్ట్ బ్యూటీస్ శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మార్చి 19న థియేటర్లలోకి వచ్చింది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్-హరీష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

Dhurandhar 2: తొమ్మిదేళ్ల నాటి రికార్డ్ తొమ్మిది రోజులు అవుట్.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన ధురంధర్ 2

అలాగే, సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద నెలకొన్న అనూహ్య పరిస్థితులు ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా, అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ‘ధురంధర్ 2’ ధాటిని తట్టుకోవడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సవాలుగా మారింది. ‘ధురంధర్ 2’ సృష్టిస్తున్న రికార్డుల హోరులో ఈ సినిమాకు థియేట్రికల్ రన్‌లో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం సాధ్యం కాలేదు.

ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీ(Ustaad Bhagat Singh OTT)లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 24న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.