Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ మొదలయ్యేది అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన పవన్?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) పై భారీ హైప్ నెలకుంది. కాగా ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల..
- gum 95921
- Published On : March 24, 2023 / 12:26 PM IST
Ustaad Bhagat Singh regular shoot
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం నాలుగు సినిమాలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ హరి హర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ చేయగా, దానికి కొంచెం బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ చిత్రీకరణ ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. దీని తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ జాయిన్ కాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Ustaad Bhagat Singh : పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ పనులు మొదలు!
తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 5 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హరీష్ శంకర్ ఈ మూవీకి సంబంధించిన ఆర్ట్ వర్క్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి భారీ సెట్ ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమాని హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్ట్ చేస్తుండగా, కె దశరధ్ కథని అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్స్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. మాళవిక మోహనన్, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Pawan – Sai Dharam : వినోదయ సిత్తం రీమేక్ నుంచి పవన్, సాయి ధరమ్ లుక్స్ లీక్.. మాములుగా లేవు!
అయితే తనని ఈ సినిమాలో ఎంపిక చేయలేదు అంటూ మాళవిక మోహనన్ ఇటీవల తెలియజేసింది. ఇక ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. అయితే కథలో చాలా చేంజెస్ చేశారట. గతంలో హరీష్ అండ్ పవన్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) కూడా హిందీ దబాంగ్ కి రీమేక్ గా వచ్చింది. గబ్బర్ సింగ్ విషయంలో హరీష్ శంకర్ చేసిన చేంజెస్ ఆడియన్స్ ని బాగా అలరించాయి. మరి ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారా? లేదా? చూడాలి.
