Pawan – Sai Dharam : వినోదయ సిత్తం రీమేక్ నుంచి పవన్, సాయి ధరమ్ లుక్స్ లీక్.. మాములుగా లేవు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ వినోదయ సిత్తం రీమేక్. టీవలే ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది. కాగా ఈ సినిమా సెట్స్ నుంచి పవన్ అండ్ సాయి ధరమ్ లుక్స్ లీక్ అయ్యాయి.

Pawan Kalyan and Sai Dharam Tej looks are leaked from Vinodhaya Sitham remake sets
Pawan – Sai Dharam : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ వినోదయ సిత్తం రీమేక్. తమిళ ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని సముద్రఖని నటిస్తూ డైరెక్ట్ చేశాడు. తమిళంలో తంబీ రామయ్య పోషించిన పాత్రని ఇక్కడ సాయి ధరమ్ తేజ్ పోషిస్తుండగా, సముద్రఖని పాత్రను పవన్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది. తెలుగులో కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం సినిమాలో ఒక భాగం మాత్రమే ఉంటుంది. దీంతో మొదటిగా పవన్ ఉన్న సీన్స్ కంప్లీట్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమా సెట్స్ నుంచి పవన్ అండ్ సాయి ధరమ్ లుక్స్ లీక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ వైట్ డ్రెస్ లో, మేడలో ఒక డిఫరెంట్ లాకెట్ తో స్టైలిష్ అండ్ రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ రెడ్ షర్ట్ పై వైట్ కోట్ వేసుకొని కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని తన ప్రధమ బాధ్యతగా బావించే సాయి ధరమ్ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ కి గురయ్యి ప్రాణం కోలుపోతాడు. అప్పుడు అతని దగ్గరికి పవన్ కళ్యాణ్ వచ్చి భూమి పై నీ సమయం అయ్యిపోయింది అని, తనతో రావాలని చెప్పి తనని తాను టైం అని పరిచయం చేసుకుంటాడు.
అయితే సాయి ధరమ్ తాను చేయవల్సిన కొన్ని పనులు ఉన్నాయి అని, తనకి ఒక మూడు నెలలు సమయం కావాలని పవన్ ని అడుగుతాడు. ఆ సమయాన్ని పవన్ ఇవ్వడమే కాకుండా, ఆ 3 నెలలు సాయి ధరమ్ తో కలిసి ప్రయాణిస్తాడు. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగిలిన కథ. అయితే తమిళంలో దీనిని ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. ఇప్పుడు పవన్ అండ్ సాయి ఇద్దరు మాస్ హీరోలు కాబట్టి ఏమన్నా కథని చేంజ్ చేశారా అనేది చూడాలి. గతంలో పవన్ ఈ తరహా పాత్ర గోపాల గోపాల సినిమాలో చేశాడు. మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి.
View this post on Instagram