×
Ad

Yellamma: ‘ఎల్లమ్మ’ సినిమాలో విలన్ గా ఒకప్పటి హీరో.. దేవికి పోటీగా భలే సెట్ చేశారు!

ఎల్లమ్మ(Yellamma) సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ కి విలన్ గా నటిస్తున్న ఒకప్పటి టాలీవుడ్ హీరో.

Vadde Naveen playing villain role in Yellamma movie.

  • శరవేగంగా ఎల్లమ్మ షూటింగ్
  • విలన్ రోల్ కోసం సీనియర్ హీరోను తీసుకున్న మేకర్స్
  • త్వరలోనే అధికారిక ప్రకటన

Yellamma: బలగం సినిమా తరువాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్న వేణు ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచినప్పటికీ షూటింగ్ స్టార్ట్ అవడం ఆలస్యం అయ్యింది. దానికి కారణం హీరోనే అని చెప్పాలి. ముందుగా ఎల్లమ్మ సినిమా కోసం చాలా మంది హీరోలను అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఈ సినిమాతో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇటీవల విడుదలైన ఎల్లమ్మ టైటిల్ గ్లింప్స్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే రేంజ్ లో దేవి లుక్ కూడా ఉండటంతో అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి ఎల్లమ్మ సినిమాపై. తెలంగాణ కల్చర్ లో భాగమైన తల్లి ఎల్లమ్మ(Yellamma) బ్యాక్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బలగం వేణు. ఇక ఈ సినిమాలో దేవి పార్శీ అనే పాత్రలో కనిపిస్తాడని చెప్పేశారు మేకర్స్.

Raakaasaa: సంగీత్ శోభన్ ‘రాకాస’ రిలీజ్ డేట్ ఫిక్స్.. నిహారిక సినిమాకి లైన్ క్లియర్

అయితే, ఈ సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో. అంతే ఇంపార్టెన్స్ విలన్ కి కూడా ఉండనుందట. ఆ పాత్రకు సంబంధించి సీనియర్ టాలీవుడ్ హీరోను తీసుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు వడ్డే నవీన్. అవును, వడ్డే నవీన్ హీరోగా అందరికి పరిచయమే. కానీ, ఈమధ్య ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు చాలా కాలం తరువాత ఎల్లమ్మ సినిమా కోసం కెమెరా ముందుకు రాబోతున్నాడట వడ్డే నవీన్.

అది కూడా కేవలం ఎల్లమ్మ కథ, ఆ కథలో తన పాత్ర నచ్చడం వల్లనే. కథ వినగానే వడ్డే నవీన్ చాలా ఎగ్జైట్ అయ్యాడట. ఇక తన పాత్ర తనకు చాలా బాగా నచ్చడంతో సినిమాల్లోకి తన రీ ఎంట్రీకి ఆ ఓపాత్ర అయితేనే పర్ఫెక్ట్ అని భావించాడట. త్వరలోనే ఆ పాత్రను కూడా పరిచయం చేయబోతున్నారట మేకర్స్. ఇక త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.