సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాకి ఉప్పెన టైటిల్ ఖరారు..
మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తుండగా, సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి జాలరి అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూవీ టీమ్ ఆ విషయాన్ని ధృవీకరించలేదు.
రీసెంట్‌గా ఈ చిత్రానికి ఉప్పెన అనే టైటిల్ పెట్టినట్టు మూవీ యూనిట్ కన్ఫమ్ చేసింది. ఈ టైటిల్ కథకు కరెక్ట్‌గా యాప్ట్ అవుతుందని నిర్మాతలు చెప్పారు. జాలర్ల జీవన నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత మందిస్తున్నాడు.