Varahi Mallipamula : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో మహిళా నిర్మాత.. ఇంప్యూర్ సినిమాతో..
వారాహి ఈ సినిమాకు నిర్మాతగానే కాక కథ అందించి నటిగా కూడా నటించింది. (Varahi Mallipamula)
- Saketh U
- Published on- September 30, 2026 / 05:25 PM IST
Varahi Mallipamula
Varahi Mallipamula : టాలీవుడ్ లోకి మరో మహిళా నిర్మాత ఎంట్రీ ఇస్తుంది. ఇంప్యూర్ అనే సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుండగా నిర్మాత వారాహి మల్లిపాముల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలని పంచుకుంది. వారాహి ఈ సినిమాకు నిర్మాతగానే కాక కథ అందించి నటిగా కూడా నటించింది.
వారాహి మల్లిపాముల మాట్లాడుతూ.. నేను కాకినాడలో పుట్టి, పెన్సిల్వేనియాలో పెరిగాను. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్నాను. ఇంజనీరింగ్, జర్నలిజంలో డబుల్ మేజర్ చేసి జాబ్ చేశాను. వీకెండ్స్ లో స్క్రిప్ట్స్ రాసుకునేదాన్ని అని తెలిపింది.
Also See : Anchor Vishnu Priya : అస్సాం కామాఖ్య ఆలయం వద్ద యాంకర్ విష్ణుప్రియ.. సంప్రదాయంగా చీరలో ఫొటోలు..
ఇంప్యూర్ సినిమా గురించి మాట్లాడుతూ.. మా ఇంటి బంగారం సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేసిన నిశాంతి ఎవాని ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఒక మహిళ కన్య కాదని ఆమె అత్తమామలకు తెలియడంతో ఆ పెళ్లిని రద్దు చేసే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది. సాధారణంగా తెలుగు సినిమాలకు బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ ని తీసుకొస్తారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అయిన యష్ణ ముత్తులూరిని తీసుకున్నాము అని తెలిపారు.
సినిమా నిర్మాతగా మారడం గురించి చెప్తూ.. నేను ఎన్నో ఏళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తూ, దగ్గరకు వచ్చి అవకాశాలు దూరం అవ్వడం వంటి సంఘటనల్ని అమ్మ చూశారు. దాంతో మా అమ్మ డబ్బు ఇస్తానంది. కానీ ఆ డబ్బుతో పూర్తి సినిమా తీయలేకపోయాను. చాలా అప్పు చేశాను. మహిళా ప్రాధాన్య సినిమాని నిర్మించేలా నిర్మాతలను ఒప్పించడం అంత సులభం కాదు. నేను రాసిన స్క్రిప్ట్‌ని ఎంతో మంది నిర్మాతలకు వినిపించాను. చాలామంది తమ సందేహాలను వ్యక్తం చేశారు. సమంత, నందిని రెడ్డి మా ఇంటి బంగారంతో హిట్ కొట్టి మహిళా ప్రాధాన్య సినిమాలని ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తారని నిరూపించారు. అందుకే థియేటర్లలో ఇంప్యూర్ సినిమాని నేనే స్వయంగా పంపిణీ చేస్తున్నాను అని తెలిపారు.
Also Read : NTR : ఎన్టీఆర్ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదా.. కష్టంగానే వచ్చాడా? నిర్మాత చెప్పినా ‘డ్రాగన్’ రిలీజ్ పై సందేహమే..
అలాగే ఈ సినిమా కోసం పనిచేసిన వారి గురించి చెప్తూ.. మా సినిమా కోసం రాజా కుమారి, కరణ్ పాండవ్‌లు కలిసి సంగీతం ఇచ్చి పాటలు పాడారు. ఈ సినిమాలో ‘ఓఎమ్‌జి’ పాటలోని హుక్ స్టెప్‌ను ప్రజలు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. రక్తపాతంతో నిండిపోయిన సినిమాల మధ్య మా ఇండిపెండెంట్ సినిమా కాస్త భిన్నంగా చూడాలని ప్రజలను కోరుతున్నాను. మా సినిమా స్త్రీ, పురుషుల సమస్యలపై ఒక కొత్త దృక్కోణాన్ని అందిస్తుంది. ఇప్పటికే ఇంప్యూర్ సినిమా ప్రీమియర్ లాస్ ఏంజిల్స్‌లోని ఓ థియేటర్‌లో, న్యూయార్క్‌లోని ఓ థియేటర్ లో వేసాము. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.
