Varalaxmi Sarathkumar : వరలక్ష్మికి కాబోయే భర్తకి ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా.. ఇది రెండో పెళ్లా?
వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్‌దేవ్ కి ఆల్రెడీ పెళ్లి అయిందని సమాచారం.
- Saketh U
- Updated on- March 4, 2024 / 09:00 AM IST
Varalaxmi Sarathkumar Fiancee Nicholai Sachdev Life Secrets
Varalaxmi Sarathkumar : సౌత్ లో లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికోలయ్ సచ్‌దేవ్ అనే ఓ ఆర్ట్ గ్యాలరిస్టుని నిశ్చితార్థం చేసుకుంది. దీంతో అందరూ ఈ జంటకి శుభాకాంక్షలు చెప్పారు. త్వరలోనే వీళ్ళు వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం. అయితే వరలక్ష్మి చేసుకోబోయే ఈ నికోలయ్ సచ్‌దేవ్ కి ఆల్రెడీ పెళ్లి అయిందని సమాచారం.
నికోలయ్ సచ్‌దేవ్ గతంలో కవిత అనే ఓ మోడల్ ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నికోలయ్ సచ్‌దేవ్ కూతురు కష సచ్‌దేవ్ పవర్ లిఫ్టింగ్ లో నేషనల్ వైడ్ పతకాలు కూడా సాధించింది. అయితే కొన్నేళ్ల క్రితమే నికొలయ్-కవిత విడాకులు తీసుకున్నారని సమాచారం. కవితతో విడాకులు తీసుకున్నాకే వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో పడి వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తుంది.
Also Read : Gopichand : గోపీచంద్ చేస్తున్న మంచి పని.. కానీ ఎవ్వరికి తెలీదు.. ఎంతోమంది పిల్లలకు..
ఈ విషయం తెలియడంతో నికోలయ్ సచ్‌దేవ్, వరలక్ష్మి వైరల్ అవుతున్నారు. అంత పెద్ద నటి రెండో పెళ్లి చేసుకునే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో వరలక్ష్మి అసలు పెళ్లే చేసుకోను అని చెప్పింది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోబోతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది అతని గతం గురించి మనకెందుకు, ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నారు అని పాజిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అసలు పెళ్లే చేసుకోను అన్న వరలక్ష్మి ఇప్పుడు నికోలయ్ సచ్‌దేవ్ ని నిశ్చితార్థం చేసుకోవడంతో వైరల్ టాపిక్ గా మారింది.
