×
Ad

Varalaxmi Sarathkumar : తెలుగు రాజకీయాల్లోకి వరలక్ష్మి శరత్ కుమార్.. ఎప్పుడు ఎంట్రీ..?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Varalaxmi Sarathkumar)

  • Published On : March 5, 2026 / 06:47 AM IST

Varalaxmi Sarathkumar

Varalaxmi Sarathkumar : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్, తెలుగులో ఫుల్ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు దర్శకురాలిగా కూడా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ లో నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా సరస్వతి. ఈ సినిమా మార్చ్ 6న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Virosh Reception : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రిసెప్షన్.. ఫొటోలు..

వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. నాకు పాలిటిక్స్ అంటే ఇష్టమే. కచ్చితంగా ఏదో ఒక రోజు పాలిటిక్స్ లోకి వస్తాను. పాలిటిక్స్ అనేది బ్యాడ్ వర్డ్ కాదు. పాలిటిక్స్ లోకి యంగ్ పీపుల్ ఇంకా చాలా మంది రావాలి. ఎవరో 70 ఏళ్ళ వ్యక్తులు వచ్చి రాజకీయం చేస్తే వాళ్లకు ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి యంగ్ స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి. తమిళనాడులో కాదు ఇక్కడ ఆంధ్ర రాజకీయాల్లోకి నేను రావొచ్చు అని తెలిపింది.

దీంతో భవిష్యత్తులో వరలక్ష్మి పాలిటిక్స్ లోకి వస్తుందని క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఆంధ్ర పాలిటిక్స్ లోకి రావొచ్చు అనడంతో ఇక్కడ ఏ పార్టీలో చేరుతుందో, ఎప్పుడు వస్తుందో అని ఆసక్తి నెలకొంది. మరి ఈ లేడీ బాస్ రాజకీయ అరంగ్రేటం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో చూడాలి.

Also Read : Virosh Reception : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రిసెప్షన్ ఫొటోలు.. ఇక్కడ చూసేయండి..