Varanasi Leak: వారణాసి యాక్షన్ సీన్ వీడియో లీక్!

Varanasi Leak: వారణాసి సినిమా స్టార్టింగ్ నుంచి విజువల్స్, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Varanasi action scene video leaked

Varanasi Leak: టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తంలో అత్యంత కట్టుదిట్టమైన టైట్‌ సెక్యూరిటీ ఉండేది రాజమౌళి సినిమాల సెట్స్‌ దగ్గరే. షూటింగ్ లొకేషన్‌లోకి సెల్‌ఫోన్లకు పూర్తిగా నిషేధం, ఐడీ కార్డు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వరని అంటుంటారు. బయటకు చిన్న క్లూ కూడా లీక్ కాకుండా ప్రతి కదలికపై నిఘా ఉంటుందని..ఆయన అంతలా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తారని అంటుంటారు.

మీడియా కంటికి కనిపించకుండా సెట్స్‌ను మేనేజ్ చేయడంలో రాజమౌళి టీమ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతటి హైసెక్యూరిటీ మధ్యలో కూడా సమాచారం బయటకు రావడం అంటే అసలు అసాధ్యమే. కానీ వారణాసి సినిమా స్టార్టింగ్ నుంచి విజువల్స్, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, ఎప్పుడు ఏదో ఒక్కటీ లీక్ అవ్వటం, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లీక్స్ ఎలా బయటకు వస్తున్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. లోపల నుంచే ఎవరో సమాచారం బయటకు పంపిస్తున్నారా.? లేక బయట నుంచి ఎవరైనా సీక్రెట్‌గా షూట్ చేస్తున్నారా? అన్న డౌట్స్‌ వ్యక్తమవుతున్నాయి. లీక్‌లను అరికట్టడంలో జక్కన్న టీమ్‌ ఫెయిల్ అవుతుందన్న టాక్ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

Also Read – Chiranjeevi : ‘కొరియ‌న్ క‌న‌కరాజు’కు మెగాస్టార్ చిరంజీవి విషెస్.. నువ్వులే న‌వ్వులు..

రాజమౌళితో మహేశ్‌ బాబు చేస్తున్న వారణాసి చిత్రం ఒక గ్లోబల్-స్పానింగ్ అడ్వెంచర్‌గా ఉండబోతోంది. ఇందులో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాశీలో ప్రారంభమయ్యే ఈ కథ, టైమ్ ట్రావెల్ నేపథ్యంతో వివిధ ప్రాంతాల మీదుగా సాగుతుందని రాజమౌళి గతంలోనే చెప్పారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి కాగా..మెయిన్‌ యాక్షన్ సీన్స్ షూట్ అయిపోయిందట.

అయితే షూటింగ్ స్పాట్ వీడియోలు లేదా ఫోటోలు లీక్ కావడం జక్కన్న టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అత్యంత గోప్యంగా ఉంచాలనుకున్న యాక్షన్ సీన్స్‌ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మేకర్స్ అలర్ట్ అయ్యారట. సెట్స్‌ దగ్గర నిఘాను ఇంకా పటిష్టం చేసి..లీకులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట.