Varsha Bollamma : మళ్ళీ RCB ఓటమి.. హార్ట్ బ్రేక్ అయింది అంటున్న వర్ష బొల్లమ్మ..

ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తుంది వర్ష. అయితే వర్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

  • Updated on- April 16, 2024 / 06:55 AM IST

Varsha Bollamma posted Heart Break Symbol over RCB Match Loss

Varsha Bollamma : కన్నడ భామ వర్ష బొల్లమ్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేస్తూ ఇప్పుడు హీరోయిన్ గా మారింది. ఇటీవలే సందీప్ కిషన్ తో ఊరుపేరు భైరవకోన సినిమాతో వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తుంది వర్ష. అయితే వర్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ బాగా ఫాలో అవుతుంది. ట్రెండ్ కి తగ్గట్టు అప్పుడప్పుడు పోస్టులు చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చాలా మంది వర్షని ఫాలో అవుతారు. వర్ష కూడా IPL లో RCB అభిమాని. RCB ఇప్పటివరకు కప్పు గెలవకపోవడం, అయినా సోషల్ మీడియాలో RCB అభిమానులు చేసే హంగామా చూస్తూనే ఉంటాము.

Also Read : Aa Okkati Adakku : ఈసారి డిసైడ్ అయ్యిపోయా అంటున్న అల్లరి నరేష్.. ఆ ఒక్కటి అడక్కు..

ఈ సీజన్ లో కూడా వరుసగా మ్యాచ్ లు ఓడిపోతుంది RCB. తాజాగా నిన్న రాత్రి SRH చేతిలో కూడా RCB ఓడిపోయింది. దీంతో మరోసారి RCB అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో వర్ష బొల్లమ్మ కూడా తన సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ అయిన సింబల్ పోస్ట్ చేసింది. ఇంకేముంది అభిమానులు, నెటిజన్లు ఆమె ట్వీట్ కింద తెగ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వర్ష ఈ సాలా కప్ నమ్దే.. అంటూ మాట్లాడిన వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు. ఇటీవల వుమెన్ RCB టీం కప్ గెలిచినప్పుడు కూడా వర్ష ట్వీట్ వేయగా ఆ ట్వీట్ ని కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి RCB ఓటమి వర్ష లాంటి సెలబ్రిటీ అభిమానులను కూడా బాధపెడుతోంది.