Aa Okkati Adakku : ఈసారి డిసైడ్ అయ్యిపోయా అంటున్న అల్లరి నరేష్.. ఆ ఒక్కటి అడక్కు..

ఈసారి డిసైడ్ అయ్యిపోయా అంటున్న అల్లరి నరేష్. ఆ ఒక్కటి అడక్కు మూవీ రిలీజ్ అప్పుడే..

Aa Okkati Adakku : ఈసారి డిసైడ్ అయ్యిపోయా అంటున్న అల్లరి నరేష్.. ఆ ఒక్కటి అడక్కు..

Allari Naresh Faria Abdullah Aa Okkati Adakku release date update

Aa Okkati Adakku : అల్లరి నరేష్ నుంచి చాలా రోజుల తరువాత.. ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ ఓ కామెడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు మల్లి అంకం ఈ మూవీని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. కాగా ఈ మూవీని మార్చిలోనే రిలీజ్ చేస్తామంటూ గతంలో ప్రకటించారు. అయితే ఆ డేట్ నుంచి పోస్టుపోన్ చేశారు.

కానీ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని నరేష్ ప్రకటించారు. “ఈసారి డిసైడ్ అయ్యిపోయా. ఈ మూవీని మే 3న థియేటర్స్ లోకి తీసుకు వస్తున్నా. ఇక థియేటర్స్ లో నవ్వుల పండగ మొదలవుతుంది” అంటూ పేర్కొన్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Also read : Teja Sajja : యోధుడిగా మారబోతున్న తేజ సజ్జ.. టైటిల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదుర్స్..

 

View this post on Instagram

 

A post shared by Allari Naresh (@allari_naresh)

కాగా ‘సుడిగాడు’ సినిమా తరువాత అల్లరి నరేష్ నుంచి మళ్ళీ ఆ రేంజ్ కామెడీ ఎంటర్టైనర్ రాలేదు. ఇక ఇటీవల ఈ హీరో కామెడీ ట్రాక్ నుంచి సీరియస్ ట్రాక్ కి టర్న్ తీసుకోవడంతో.. అల్లరి నరేష్ నుంచి మళ్ళీ ఓ కామెడీ ఎంటర్టైనర్ రాదేమో అని భయపడ్డారు. కానీ ఇప్పుడు ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ సూపర్ హిట్ టైటిల్ ని పెట్టుకొని ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఈసారి థియేటర్స్ లో నిజంగానే నవ్వులు పూయిస్తారేమో చూడాలి.