Teja Sajja : యోధుడిగా మారబోతున్న తేజ సజ్జ.. టైటిల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదుర్స్..
యోధుడిగా మారబోతున్న తేజ సజ్జ. కార్తీక్ ఘట్టమనేనితో చేయబోయే సినిమా టైటిల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదుర్స్.

Teja Sajja Karthik Gattamneni title glimpse announcement poster
Teja Sajja : ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా సూపర్ సక్సెస్ తరువాత తేజ సజ్జ నటించబోయే సినిమా ఏంటని అందరిలో ఆసక్తి నెలకుంది. ఇక ఆ ఆసక్తి తగ్గట్లే తేజ సజ్జ కూడా అదిరిపోయే కాంబినేషన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సూర్య వెర్సస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న కార్తీక్ ఘట్టమనేని.. తన నెక్స్ట్ మూవీని తేజతో చేయబోతున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించబోతోంది. సూపర్ యోధ అడ్వెంచర్ డ్రామాతో ఈ సినిమా కథ ఉండబోతుంది అంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ గురించి తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో తేజ లాంగ్ హెయిర్‌తో కత్తి ధరించి యోధుడిగా కనిపిస్తున్నారు. ఇక ఇది చూసిన ఆడియన్స్.. తేజ సజ్జ ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నారో అని క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. కాగా ఈ టైటిల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ ఏప్రిల్ 18న ఇవ్వబోతున్నట్లు తెలియజేసారు.
Also read : Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్.. అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్‌తో..
Glad to be joining forces with the SuperHero @TejaSajja123 for our prestigious #PMF36 ❤️?
An adventurous saga of #SuperYodha ?
Directed by @Karthik_gatta ?
Produced by @vishwaprasadtg ✨Title Announcement Glimpse on ????? ???? ?
Stay tuned ? pic.twitter.com/h3VjtaslHW
— People Media Factory (@peoplemediafcy) April 15, 2024
కాగా ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారని కూడా చెబుతున్నారు. మరి టైటిల్ అనౌన్స్‌మెంట్ తో పాటు ఈ వార్తల పై కూడా ఓ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.