Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్.. అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్‌తో..

అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్‌ పాత్రలతో సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్ రాబోతోందా..? వంగ ఏం చెప్పాడు..?

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్.. అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్‌తో..

Sandeep Reddy Vanga cinematic universe with Arjun Reddy Animal Spirit Roles

Updated On : April 15, 2024 / 5:19 PM IST

Prabhas : సందీప్ రెడ్డి వంగ తీసింది రెండే రెండు సినిమాలు (అర్జున్ రెడ్డి, యానిమల్). కానీ ఆ సినిమాలోని హీరోల పాత్రల క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ లో బలమైన ముద్ర వేశారు. అర్జున్ రెడ్డి తెలుగు మూవీలో నటించిన విజయ్ దేవరకొండ పాత్ర, అలాగే హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ చేసిన పాత్ర, ఇక ఇటీవల యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ పాత్ర.. ఆల్ఫా క్యారెక్టరైజేషన్ తో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ని కలుగజేసింది.

ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమాలో కూడా హీరో పాత్ర.. ఆల్ఫా తరహాలోనే ఉండబోతుందని తెలుస్తుంది. ఇలా సందీప్ వంగ సృష్టించే హీరో పాత్రలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఆసక్తితోనే ఆడియన్స్ ఒక ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సినిమాటిక్ యూనివర్స్ కి తగ్గట్లు.. అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్ పాత్రలతో ఓ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని ఉహించుకుంటున్నారు.

Also read : Pushpa 2 : పుష్ప 2కి లైన్ క్లియర్.. బాహుబలి కలెక్షన్స్‌ దగ్గరకి వెళ్లే ఛాన్స్..

ఈక్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఇక ఈ ఆలోచన గురించి సందీప్ వంగని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళ్ అవార్డు ఫంక్షన్ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ వంగని ఈ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “సినిమాటిక్ యూనివర్స్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఈ నలుగుర్ని (విజయ్ దేవరకొండ, ప్రభాస్, రణ్‌బీర్ కపూర్, షాహిద్ కపూర్) ఒకే ఫ్రేమ్ లో చూడడం చాలా ఇంటరెస్టింగ్ ఉంది. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు ఏమైనా ఐడియా వస్తే, తప్పకుండా మూవీ చేస్తా” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ కామెంట్స్ విన్న ఆడియన్స్.. ఆ సినిమాటిక్ యూనివర్స్ ఐడియా వర్క్ అవుట్ అయితే బాగుందని ఫీల్ అవుతున్నారు. మరి ఫ్యూచర్ లో ఈ ఐడియా ఏమైనా సెట్స్ పైకి వస్తుందేమో చూడాలి.