Pushpa 2 : పుష్ప 2కి లైన్ క్లియర్.. బాహుబలి కలెక్షన్స్‌ దగ్గరకి వెళ్లే ఛాన్స్..

పుష్ప 2కి లైన్ క్లియర్ అయ్యిపోయింది. ఇక బాహుబలి 2, కేజీఎఫ్ 2 స్థాయి కలెక్షన్స్ ని అందుకోవడం లేదా, క్రాస్ చేయడం పక్కా.

Pushpa 2 : పుష్ప 2కి లైన్ క్లియర్.. బాహుబలి కలెక్షన్స్‌ దగ్గరకి వెళ్లే ఛాన్స్..

Singham Again postpone now Pushpa 2 is solo release

Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్‌ కలయికలో వచ్చిన ‘పుష్ప’.. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ భారీ విజయం అందుకోవడంతో.. సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా ఈ మూవీ రిలీజ్ డేట్ (ఆగష్టు 15) లాగ్ వీకెండ్ తో ఉండడంతో.. ఈ సెకండ్ పార్టు భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుందని బన్నీ అభిమానులు లెక్కలు వేసుకున్నారు.

బాహుబలి 2, కేజీఎఫ్ 2 తరువాత మళ్ళీ బాలీవుడ్ అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రం పుష్ప 2. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాహుబలి 2, కేజీఎఫ్ 2 స్థాయి కలెక్షన్స్ ని అందుకోవడమే కాదు, క్రాస్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని అందరూ అనుకున్నారు. అయితే అదే డేట్ కి బాలీవుడ్ నుంచి ‘సింగం ఎగైన్’ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి పుష్ప 2 కలెక్షన్స్ కి అడ్డంకిగా మారారు.

Also read : Aishwarya Shankar : రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. భారీగా తరలి వచ్చిన సెలబ్రిటీలు..

సింగం ఎగైన్ రిలీజ్ వల్ల నార్త్ బెల్ట్ లో పుష్ప 2 కలెక్షన్స్ కి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఇప్పుడు పుష్ప 2కి లైన్ క్లియర్ అయ్యినట్లు సమాచారం. సింగం ఎగైన్ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉందట. ఆ తేదీకి తీసుకు రావాలని ప్రయత్నించి.. సరైన అవుట్ పుట్ తో వెళ్లకపోతే అభిమానుల అంచనాలను అందుకోలేము, కాబట్టి సినిమా అవుట్ పుట్ అంతా అనుకున్నట్లే వచ్చినప్పుడే వెల్దామని అజయ్ దేవగన్.. దర్శకనిర్మాతలకు సూచించారట.

దీంతో సింగం ఎగైన్ ని పోస్టుపోన్ చేసేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. ఈ చిత్రాన్ని దీపావళికి తీసుకు రావాలని భావిస్తున్నారట. ఇక ఈ మూవీ పోస్టుపోన్ తో పుష్ప 2కి లైన్ క్లియర్ అయ్యింది. ఆగష్టు 15న పుష్ప నేషనల్ వైడ్ సోలో రిలీజ్ కాబోతుంది. మరి ఈ రిలీజ్ తో బాహుబలి 2, కేజీఎఫ్ 2 స్థాయి కలెక్షన్స్ ని పుష్ప నమోదు చేస్తుందో లేదో చూడాలి.