Aishwarya Shankar : రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. భారీగా తరలి వచ్చిన సెలబ్రిటీలు..

తాజాగా నేడు ఉదయం ఐశ్వర్య శంకర్ వివాహం డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తరుణ్ కార్తికేయన్ తో జరిగింది.

Aishwarya Shankar : రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. భారీగా తరలి వచ్చిన సెలబ్రిటీలు..

Director Shankar Daughter Aishwarya Shankar Marriage happened with Tarun Karthikeyan Photos goes Viral

Updated On : April 15, 2024 / 2:22 PM IST

Aishwarya Shankar : తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తన కూతురు ఐశ్వర్య శంకర్‌కు నేడు రెండో పెళ్లి చేశారు. గతంలో ఐశ్వర్య శంకర్ కు రోహిత్ అనే ఓ క్రికెటర్‌తో కరోనా సమయంలో ఘనంగా వివాహం జరిగింది. అయితే రోహిత్ పై పోక్సో కేసు నమోదవ్వడం, అతను పలు వివాదాల్లో నిలవడంతో పెళ్ళైన కొన్ని నెలలకే పెళ్లిని రద్దు చేసుకున్నారు.

తాజాగా నేడు ఉదయం ఐశ్వర్య శంకర్ వివాహం డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తరుణ్ కార్తికేయన్ తో జరిగింది. ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం జరగగా నేడు ఉదయం ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహానికి తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్, రజినీకాంత్, కార్తీ, సూర్య, మణిరత్నం, విక్రమ్, నయనతార, కమల్ హాసన్.. లతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు..

Director Shankar Daughter Aishwarya Shankar Marriage happened with Tarun Karthikeyan Photos goes Viral

Also Read : NTR – Urvashi Rautela : ఎన్టీఆర్‌తో ఊర్వశి సెల్ఫీ వైరల్.. ఏం ఫిల్టర్స్ వాడావు అక్కాయ్.. ఎన్టీఆర్‌ని పిల్లోడిని చేసేసావు..

దీంతో డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ వివాహం వైరల్ గా మారగా ఐశ్వర్య – తరుణ్ కార్తికేయన్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక పలువురు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.