×
Ad

Varun Lavanya Sangeet Party : వరుణ్ లావణ్య సంగీత్ ఫోటోలు లీక్.. చరణ్, అల్లు అర్జున్ సందడి..

వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) జంట ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారు. నిన్న అక్టోబర్ 30 రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ చేసుకున్నారు.

  • Published On : October 31, 2023 / 09:41 AM IST

Varun Lavanya Sangeet Party Photo Leaked in Social Media

Varun Lavanya Sangeet Party : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) జంట ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారు. ఇటలీలోని(Italy) టుస్కానీ నగరంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలు, పలువురు సన్నిహితులు ఇటలీకి చేరుకొని సందడి చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నట్టు తెలుస్తుంది.

నిన్న అక్టోబర్ 30 రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ చేసుకున్నారు. దీంతో ఈ పార్టీలోని కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి.. అలాగే చరణ్, ఉపాసన దంపతులు వరుణ్ లావణ్యకు కంగ్రాట్స్ తెలుపుతూ ఫోటోలు దిగారు. వీరిలో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. నిన్న రాత్రి సంగీత్ పార్టీలో మెగా ఫ్యామిలీ ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.

Also Read : Varun lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం.. ఏ రోజు ఎన్ని గంటలకు..? ఫుల్ డీటెయిల్స్..

ఇక నేడు అక్టోబర్ 31 ఉదయం హల్దీ వేడుకలు, సాయంత్రం మెహందీ వేడుక, రేపు నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల ముహూర్తంకు పెళ్లి, నవంబర్ 1 రాత్రి రిసెప్షన్ నిర్వహించనున్నారు. వరుణ్ లావణ్య పెళ్లి వేడుకల ఫోటోల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.