Constable : వరుణ్ సందేశ్ వరుస సినిమాలతో వస్తున్నాడుగా.. ‘కానిస్టేబుల్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

తాజాగా వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Varun Sandesh Next Movie Constable Motion Poster Released

Constable : వరుణ్ సందేశ్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాలతో వస్తున్నాడు. నింద, విరాజి.. లాంటి థ్రిల్లర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మెప్పించి ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమా ‘కానిస్టేబుల్’తో రాబోతున్నాడు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మాణంలో ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో ఈ కానిస్టేబుల్ సినిమా తెరకెక్కుతుంది. మధులిక వారణాసి హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాలో.

Also Read : Allu Arjun – Balakrishna : బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు ఐకాన్ స్టార్.. టాలీవుడ్ స్టార్స్ అంతా కదిలొచ్చేలాగే ఉన్నారుగా..

తాజాగా కానిస్టేబుల్ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ మోషన్ వీడియో చూస్తుంటే మోకిలా పోలీస్ స్టేషన్ లో జరిగే ఏదో సంఘటన, అక్కడ పనిచేసే కానిస్టేబుల్ వరుణ్ సందేశ్ ఏం చేసాడు అని ఆసక్తిగా సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా కానిస్టేబుల్ మోషన్ పోస్టర్ వీడియో చూసేయండి..

మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్ గా మరో కొత్తకోణంలో నటిస్తున్నాను. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను అని తెలిపారు. నిర్మాత బలగం జగదీష్, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూస్తారు అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు