మెగా హీరోలలో ప్రిన్స్ అని పిలిపించుకునే వరుణ్ తేజ్ స్టొరీ సెలెక్షన్ మొదటి నుంచి విభిన్నంగానే ఉంది. అదే ట్రెండ్ ఫాలో అవుతూ ‘జిగార్తాండ’ రీమేక్ వాల్మీకి లో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు.
మెగా హీరోలలో ప్రిన్స్ అని పిలిపించుకునే వరుణ్ తేజ్ స్టొరీ సెలెక్షన్ మొదటి నుంచి విభిన్నంగానే ఉంది. అదే ట్రెండ్ ఫాలో అవుతూ ‘జిగార్తాండ’ రీమేక్ వాల్మీకి లో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా కిరణ్ కొర్రపాటి అనే డెబ్యూ దర్శకుడితో ఒక స్పోర్ట్స్ డ్రామాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందుకోసం బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవడానికి రెండు నెలలుగా వరుణ్ తేజ్ ఫారిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వరుణ్ శిక్షణ ఓ కొలిక్కి వస్తున్నట్లు తెలిసింది.
Read Also : నంబర్ ప్లేటు మారితే బుక్కైపోతారు
ఇంగ్లాండ్‌కు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ టోనీ డేవిడ్ జెఫ్రీస్ వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ‘‘టోనీ జెఫ్రీస్ నీతో రెండు నెలలుగా శిక్షణ బాగా జరిగింది. ఇప్పుడు మిస్ అవుతున్నాను. త్వరలో ట్రైనింగ్ మళ్లీ స్టార్ట్ చేద్దాం’’ అని పేర్కొన్నారు వరుణ్ తేజ్. ఇక్కడ లేటెస్ట్ వరుణ్‌తేజ్ లుక్‌ని గమనిస్తే… వరుణ్ బాగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. పాత్ర కోసమే ఇదంతా అని ఊహించుకోవచ్చు.
ఇప్పుడు వరుణ్ చాలా ఫిట్ గా ఉన్నాడు. మీసాలు గెడ్డం ఫుల్ గా పెంచి డిఫరెంట్ లుక్ లో కనిసిస్తున్నాడు. మొత్తానికి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని అచ్చం హాలీవుడ్ హీరోలాగా కనిపిస్తున్నాడు. తన కొత్త సినిమాకోసం వరుణ్ పూర్తిగా మారిపోయాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో నటుడు సునీల్ శెట్టి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళకమునుపే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Also : బ్లేడుతో పనిలేదు: రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్‌బై