Varun Tej : ఈసారి ఎన్నికల్లో పవన్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయనుందా..? వరుణ్ తేజ్ ఏం చెప్పాడు..?
ఇటీవల చిరంజీవి, వరుణ్ తేజ్ పొలిటికల్ పరంగా పలు వ్యాఖ్యలు చేయగా బాగా వైరల్ అయ్యాయి. తాజాగా వరుణ్.. వచ్చే ఎన్నికల్లో పవన్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయనుందా..? అనే విషయాన్ని తెలియజేశాడు.
- gum 95921
- Published On : August 18, 2023 / 05:09 PM IST
Varun Tej gave clarity about mega family support to pawan kalyan in next AP elections
Varun Tej : యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే వరుణ్, సాక్షి, ప్రవీణ్ కలిసి 10tv ఛానల్ కి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇచ్చారు.
కాగా ఇటీవల చిరంజీవి (Chiranjeevi) పొలిటికల్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. మొదట ఆ కామెంట్స్ పవన్ అండ్ జనసేనకి సపోర్ట్ చేస్తూ చేసినవి అని అందరూ అనుకున్నారు. కాని చిరంజీవి.. పార్లమెంట్ లో విజయ్ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ ఆ వ్యాఖ్యలు చేశారని తరువాత తెలిసింది. ఈ విషయం కంటే ముందు బ్రో (Bro) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్.. “సినిమా అయినా, రాజకీయం అయినా బాబాయ్ వెనుకే మా కుటుంబమంతా” అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయనుందా..? అనే ప్రశ్నలు మొదలు అయ్యాయి.
Baby Movie : ఆహాలోకి వచ్చేస్తున్న ‘బేబీ’ మూవీ.. డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
ఇక వీటన్నిటి గురించి ప్రస్తావిస్తూ 10tv విలేకరి వరుణ్ తేజ్ ని ప్రశ్నించగా, వరుణ్ బదులిస్తూ.. “పవన్ బాబాయ్ కి మా అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అవసరమైతే మా కుటుంబం మొత్తం ఆయనకి సపోర్ట్ నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత ఎన్నికల సమయంలో నాకు సాధ్యమైనంత సపోర్ట్ నేను బాబాయ్ కి ఇచ్చాను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అయినా, ఆ తరువాత అయినా మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఇవ్వడం అనే విషయంలో ఎటువంటి మార్పు ఉండదు” అంటూ వెల్లడించాడు.
