Manchu Vishnu : బాలీవుడ్ డైరెక్టర్‌తో ‘భక్త కన్నప్ప’.. సైలెంట్‌గా మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ స్టార్ట్..

భక్త కన్నప్ప సినిమా స్టార్ట్ చేసిన మంచు మనోజ్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్..

Manchu Vishnu : బాలీవుడ్ డైరెక్టర్‌తో ‘భక్త కన్నప్ప’.. సైలెంట్‌గా మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ స్టార్ట్..

Manchu Vishnu starts Bhakta Kannappa movie Nupur Sanon heroine

Updated On : August 18, 2023 / 4:25 PM IST

Manchu Vishnu : మంచు విష్ణు గత ఏడాది ‘జిన్నా’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ తరువాత ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. తాజాగా ఎటువంటి హడావుడి లేకుండా ఏకంగా పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేసేశాడు విష్ణు. కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తిరిగి తెరకెక్కించడానికి ఇప్పటి మేకర్స్ చాలామంది బాగా ట్రై చేశారు. ఈక్రమంలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు పేర్లు మారుతూ వచ్చాయి. అయితే గత కొంతకాలం నుంచి మంచు విష్ణు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు గట్టిగా చెప్పుకొచ్చాడు.

Vijay Jagarlamudi : స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్ తీసి.. గుండెపోటుకు గురైన సినీ నిర్మాత..

తాజాగా ఆ మాటలని నిజం చేస్తూ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసేశాడు. ‘కన్నప్ప’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు (Mohan Babu) నిర్మించబోతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక విష్ణుకి జోడిగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ (Nupur Sanon) నటిస్తుంది.

Rajamouli : నార్వేలో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి..

ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో శ్రీ కాళహస్తిలో చిత్ర యూనిట్ లాంచ్ చేశారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్ మరియు తోట ప్రసాద్ ఈ మూవీకి స్టోరీ అందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఈ మూవీ కోసం మరికొంతమంది స్టార్ క్యాస్ట్ అండ్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలియజేశారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్ లో మొత్తం కంప్లీట్ చేస్తామని, చిత్రీకరణ మొత్తం కూడా న్యూజిలాండ్ లో జరగనుందని విష్ణు తెలియజేశాడు. తరతరాలు గుర్తు పెట్టుకునేలా భక్త కన్నప్ప సినిమాని నిర్మిస్తామని మోహన్ బాబు పేర్కొన్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.