Vijay Jagarlamudi : స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్ తీసి.. గుండెపోటుకు గురైన సినీ నిర్మాత..

గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి కథని బయోపిక్ రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నంలో గుండెపోటుకు గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన నిర్మాత.

Vijay Jagarlamudi : స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్ తీసి.. గుండెపోటుకు గురైన సినీ నిర్మాత..

Tollywood Producer Vijay Jagarlamudi attacked by cardiac arrest due to late of Khudiram Bose biopic release

Vijay Jagarlamudi : ప్రస్తుతం ఆడియన్స్ అంతా పాన్ ఇండియా కథలు పై ఆసక్తి చూపిస్తుండడంతో మేకర్స్ కూడా అటువంటి సబ్జెట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కొంతమంది మేకర్స్.. స్వాతంత్రం కోసం పోరాడి ఎవరికి తెలియకుండా చరిత్రలోనే మిగిలిపోతున్న ఎంతోమంది సమరయోధులు జీవిత కథలను ప్రతి ఒక్కరికి పరిచయ చేసి, వారిని గుర్తుపెట్టుకునేలా చేయడానికి సినిమాలు తెరకెక్కిస్తూ ప్రయత్నిస్తున్నారు.

Prem Kumar Review : PK కి పెళ్లి అయ్యిందా..? సంతోష్ శోభన్ ‘ప్రేమ్ కుమార్’ సినిమా రివ్యూ..!

ఈక్రమంలోనే నిర్మాత విజ‌య్ జాగర్ల‌మూడి గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై ‘ఖుదీరామ్ బోస్’ (Khudiram Bose) బయోపిక్ ని తెరకెక్కించడానికి పూనుకున్నారు. కేవలం 18 ఏళ్ళ వయసులోనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో స్ఫూర్తి పొంది దేశం కోసం పోరాటం చేసి ప్రాణ త్యాగం చేశారు ఖుదీరామ్ బోస్. 15 ఏళ్ళ వయసు నుంచి పోరాటం మొదలు పెట్టిన ఖుదీరామ్ బోస్.. బ్రిటిష్ వారికి చెమటలు పట్టించి ఆగష్టు 11, 1908 లో మరణించారు. అలాంటి గొప్ప యోధుడి కథని విజ‌య్ జాగర్ల‌మూడి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

Nick Jonas Falls Off Stage : మ్యూజిక్ కన్సర్ట్‌లో స్టేజ్ పై పడిపోయిన ప్రియాంక చోప్రా భర్త .. వీడియో వైరల్

సినిమా షూటింగ్ కూడా మొత్తం పూర్తి అయ్యింది. మణిశర్మ, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ తోట త‌ర‌ణి ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా, స్టంట్ డైరెక్ట‌ర్‌ క‌న‌ల్ క‌న్న‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌ ర‌సూల్ ఎల్లోర్, ఎడిట‌ర్‌ మార్తాండ్ కె.వెంక‌టేష్.. ఇలా టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. ఈ చిత్రాన్ని ఇటీవ‌ల గోవాలో జ‌రిగిన ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌దర్శించ‌గా మంచి స్పంద‌న వచ్చింది. అంతకు ముందు పార్లమెంట్‌ సభ్యులకు కూడా ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.

సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నా మూవీ మాత్రం విడుదలకు నోచుకోలేకపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమా తీయడం, అదేమో రిలీజ్ కాకపోవడంతో ఆర్థిక సమస్యలు, మనస్థాపం చెంది నిర్మాత గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.