Korean Kanakaraju : బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు తొలి రోజు కలెక్షన్ ఎంతంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం కొరియన్ కనకరాజు (Korean Kanakaraju).
- Thota Vamshi Kumar
- Updated on- August 8, 2026 / 12:22 PM IST
Varun Tej Korean Kanakaraju day 1 colletion
Korean Kanakaraju : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రితికా నాయక్ కథానాయకగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషఫన్ నిర్మించింది. హారర్-కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ప్రీమియర్లతో కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు 10.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలిపింది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.
Supritha : నటి సురేఖ వాణి కూతురు.. సుప్రీత బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు..
ఇక నేడు శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ చిత్ర వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
10.20 CRORES+ GROSS for the NON-STOP ENTERTAINER #KoreanKanakaraju on Day 1 including Premieres 🤎🤎🤎
ALL TIME HIGHEST OPENING GROSSER FOR @IamVarunTej 🔥🔥🔥
The entire team is Truly grateful to the audience for showering the film with such incredible love and support at the… pic.twitter.com/3QHHtRQjRn
— UV Creations (@UV_Creations) August 8, 2026
