Korean Kanakaraju : కొరియన్ కనకరాజు కోసం వస్తున్న మెగాస్టార్.. మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. ఎప్పుడు? ఎక్కడ?

ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. (Korean Kanakaraju)

  • Updated on- August 10, 2026 / 08:03 PM IST

Korean Kanakaraju

Korean Kanakaraju : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన సినిమా ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాణంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయింది.

ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో హిట్ కొట్టాడు. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయింది ఈ సినిమా. ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది కొరియన్ కనకరాజు. ఈ సినిమా విజయం సాధించడం, చాన్నాళ్ల తర్వాత వరుణ్ తేజ్ హిట్ కొట్టడంతో మూవీ యూనిట్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది.

Also See : Patas Praveen : భర్త కాళ్ళు మొక్కిన భార్య.. జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాలు పూజలు..

కొరియన్ కనకరాజు సినిమా మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారు. ఈ ఈవెంట్ ని రేపు ఆగస్టు 11న హైదరాబాద్ లోని ITC కోహినూర్ హోటల్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహించబోతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కి భారీగా తరలి రానున్నట్టు తెలుస్తుంది. చాన్నాళ్ల తర్వాత వరుణ్ హిట్ కొట్టడంతో పెదనాన్న చిరంజీవి ఏం మాట్లాడతారో అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.