×
Ad

Varun Lavanya : వరుణ, లావణ్య.. పెళ్ళైన తర్వాత మొదటి వాలెంటైన్స్ డే.. అడ్వెంచర్స్ చేస్తూ.. ఎక్కడో తెలుసా?

వరుణ్ లావణ్యలకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి వాలెంటైన్స్ డే కావడంతో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు.

  • Published On : February 15, 2024 / 03:51 PM IST

Varun Tej Lavanya Tripathi Enjoying in Kashmir on their first Valentines day after Marriage

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆరేళ్లుగా ప్రేమించుకొని గత సంవత్సరం గ్రాండ్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్స్, ఫ్యామిలీ ట్రిప్స్ వేసి ఇప్పుడిప్పుడే సినిమా వర్క్స్ మళ్ళీ మొదలుపెట్టారు. అయితే నిన్న వాలెంటైన్స్ డే కావడంతో, వరుణ్ లావణ్యలకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి వాలెంటైన్స్ డే కావడంతో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు.

Also Read : Sivakarthikeyan : శివ కార్తికేయన్‌తో సినిమా అనౌన్స్ చేసిన మురుగదాస్.. ఈసారైనా..!

వరుణ్ తేజ్ తన భార్యతో కలిసి కశ్మీర్(Kashmir) హిమాలయాల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. వరుణ్ లావణ్య కలిసి నిన్న కశ్మీర్ దాల్ సరస్సులో విహారయాత్ర చేసారు. అక్కడ దిగిన ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో షేర్ చేసుకున్నారు. ఇక నేడు ఉదయం కశ్మీర్ లోని గుల్మార్గ్ మంచులో స్కేటింగ్ చేస్తూ అడ్వెంచర్స్ చేశారు. గుల్మార్గ్ మంచులో ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి వాలెంటైన్స్ డేని వరుణ్ లావణ్యలు ఇలా కశ్మీర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.