VarunLav : వరుణ్, లావణ్య హల్దీ వేడుక పిక్స్ వైరల్.. పవన్ కళ్యాణ్ అభిమానుల బాధ..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నుంచి వస్తున్న ప్రతి ఫోటో కింద పవన్ అభిమానులు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.
- gum 95921
- Updated on- October 31, 2023 / 08:32 PM IST
Varun Tej Lavanya Tripathi haldi photos pawan kalyan fans comments
VarunLav : ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి కోసం మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలు, పలువురు సన్నిహితులు ఇటలీకి చేరుకొని సందడి చేస్తున్నారు. నిన్న అక్టోబర్ 30 రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీతో మెగా కుటుంబం అంత ఎంజాయ్ చేసింది. ఈ పార్టీలో నితిన్, నీరజ కోన వంటి ఇండస్ట్రీ స్టార్స్ కూడా హాజరయ్యారు.
ఆ పార్టీలో వరుణ్ లావణ్యతో పాటు అల్లు అర్జున్-స్నేహారెడ్డి, రామ్ చరణ్-ఉపాసన దంపతులు కలిసి దిగిన ఫోటోలు బయటకి వచ్చి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక నేడు హల్దీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. ఆ పిక్స్ లో వరుణ్, లావణ్యతో పాటు చిరంజీవి, నాగబాబు దంపతులు కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన కొందరు పవన్ అభిమానులు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.
ఈ పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా బయటికి రాకపోవడంతో అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. మెగా వెడ్డింగ్ నుంచి వస్తున్న ప్రతి ఫోటో కింద పవన్ అభిమానులంతా ఒకటే కామెంట్.. ‘పవన్ కళ్యాణ్ పిక్ ఉంటే పెట్టండి బ్రో’. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ హల్దీ వేడుక పిక్స్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
Also read : Varun Lavanya Sangeet Party : వరుణ్ లావణ్య సంగీత్ ఫోటోలు లీక్.. చరణ్, అల్లు అర్జున్ సందడి..
ఇక ఈరోజు రాత్రి మెహందీ వేడుక నిర్వహించనున్నారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల ముహూర్తంకు వరుణ్ లావణ్య ఒక్కటవ్వనున్నారు. అదే రోజు రాత్రి అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఇటలీ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చాక నవంబర్ 5న ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇండస్ట్రీ పర్సన్స్ కోసం ఇక్కడ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
