Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ఫిక్స్ చేసేది ఎవరో తెలుసా..?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ఫిక్స్ చేసేది ఎవరు..? ఈ ఏడాది ఉండబోతుందా..? లేక నెక్స్ట్ ఇయర్..?
- gum 95921
- Updated on- October 29, 2023 / 11:23 AM IST
Varun Tej Lavanya Tripathi marriage date and who proposed first
Varun Tej – Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్ళ పాటు రహస్యంగా ప్రేమించుకున్న వీరిద్దరూ ఈ ఏడాది జూన్ 9న ఇరు కుటుంబసభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ జరుపుకొని అందరికి వారి ప్రేమ ప్రయాణం గురించి తెలియజేశారు. ఇక వీరిద్దరూ ఎప్పుడు ఏడడుగులు వేయబోతున్నారో అనేది అందరిలో ఉన్న మొదటి ప్రశ్న.
Aadi Keshava : వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ న్యూ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది.. కొత్త తేదీ..?
ఈ ఏడాది పెళ్లి జరగొచ్చు, లేదు వచ్చే ఏడాదే వరుణ్, లావణ్య మేడలో మూడు ముళ్ళు వేయనున్నాడని అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలు పై వరుణ్ కొంచెం క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను నటించిన ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) మూవీ ప్రమోషన్స్ లో ఉన్న వరుణ్ ని పెళ్లి తేదీ గురించి ప్రశ్నించగా.. ఈ సంవత్సరమే పెళ్లి ఉంటుందని వెల్లడించాడు. అయితే పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదట. ఆ తేదీ విషయం వరుణ్ మదర్, నాగబాబు సతీమణి ‘పద్మజ’ చూసుకుంటున్నారట.
Varun Tej : ఈసారి ఎన్నికల్లో పవన్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయనుందా..? వరుణ్ తేజ్ ఏం చెప్పాడు..?
పెళ్లి తేదీ విషయంలో ఆమెదే తుది నిర్ణయమని వరుణ్ తెలియజేశాడు. అలాగే పెళ్లి కూడా చాలా సింపుల్ గా చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇక లవ్ విషయంలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. తానే ముందుగా ప్రపోజల్ పెట్టినట్లు వెల్లడించాడు. దానికి లావణ్య కూడా ఓకే అనడం, ఆ తరువాత కుటుంబాలకు తెలియజేయడం వాళ్ళు కూడా ఓకే చేసేయడం జరిగింది. మరి ఈ మెగా జంట ఎప్పుడు ఏడడుగులు వేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
