Pawan Kalyan : వరుణ్ లావణ్యల పెళ్లి.. పవన్ పై వచ్చే మీమ్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..
వరుణ్ లావణ్యల పెళ్లి నుంచి పవన్ ఫోటో ఒకటి కూడా రావడం లేదని.. పవన్ ఫ్యాన్స్ బాధతో మీమ్స్ చేస్తూ నెటిజెన్స్ ని నవ్విస్తున్నారు.
- gum 95921
- Updated on- November 1, 2023 / 03:14 PM IST
Varun Tej Lavanya Tripathi wedding Pawan Kalyan fans creating memes on him
Pawan Kalyan : ఇటలీలోని టుస్కానీ నగరంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. గత మూడు రోజులు నుంచి సంగీత్, కాక్ టైల్, హల్దీ, మెహందీ వేడుకలతో సందడిగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలతో పాటు పలువురు సన్నిహితులు, హీరో నితిన్, నీరజ కోన వంటి ఇండస్ట్రీ స్టార్స్ కూడా హాజరయ్యి సందడి చేస్తున్నారు.
ఇక ఈ పెళ్లి వేడుక నుంచి ఫోటోలు లీక్ అవుతూ వస్తున్నాయి. ఆ పిక్స్ లో చిరంజీవి నుంచి నితిన్ వరకు అందరూ కనిపిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించడం లేదు. దీంతో పవన్ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. మెగా వెడ్డింగ్ నుంచి వస్తున్న ప్రతి ఫోటో కింద పీకే అభిమానులంతా ఒకటే కామెంట్ చేస్తూ వస్తున్నారు. ‘పవన్ కళ్యాణ్ పిక్ ఉంటే పెట్టండి బ్రో’ అంటూ వేడుకుంటున్నారు. కొంతమంది అభిమానులు అయితే కొన్ని మీమ్స్ చేస్తూ నెటిజెన్స్ ని నవ్విస్తున్నారు. మరి ఆ మీమ్స్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
Also read :Aadi Keshava : మళ్ళీ పోస్టుపోన్ అయిన మెగా హీరో సినిమా.. ఈసారి కారణం అదేనట..
