Varun Tej : నాకు సినిమా తప్ప ఏం తెలీదు.. పెదనాన్న పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు..

ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. (Varun Tej)

  • Published on- August 11, 2026 / 08:09 PM IST

Varun Tej

Varun Tej : వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. నేడు కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.

Also Read : Nagababu : మాకు సమస్య వస్తే అన్నయ్య నిలబడతాడు.. చిన్నప్పుడు అన్నయ్య వరుణ్ ని.. నాగబాబు కామెంట్స్..

ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. నాకు సినిమాకు తప్ప వేరే ఏం తెలియవు. నేను చిరంజీవి గారు చెప్పినవి ఫాలో అవుతాను. మా పెదనాన్న పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు అనుకుంటాను. మా అమ్మ, నాన్న గర్వంగా ఫీల్ అవ్వాలి. మా కళ్యాణ్ బాబాయ్, చరణ్ అన్న కళ్ళల్లో సంతోషం చూడాలి. చిన్నప్పట్నుంచి నాకు ఆగస్టు 22 అంటే నేషనల్ హాలిడే. చిన్నప్పుడు నాన్న దగ్గరకు వెళ్లి ఆ రోజు స్కూల్ కి వెళ్ళను అని చెప్పేవాడిని. వెంటనే పెదనాన్న ఇంటికి పంపించేసేవారు. ఈసారి పెదనాన్న పుట్టిన రోజు ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ తో ఉంటుంది అని అన్నారు.