Vijaylakshmi Veerappan : వీరప్పన్ కూతురు కొత్త అవతారం.. సినిమాల్లోకి ఎంట్రీ.. ఫస్ట్ లుక్ అదుర్స్
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ రెండో కూతురు విజయలక్ష్మి వీరప్పన్ కొత్త అవతారం ఎత్తారు. అచ్చం తండ్రిలానే కనిపించారు..

Veerappan Daughter Vijaylakshmi Veerappan Acts In Movie
Vijaylakshmi Veerappan : గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ రెండో కూతురు విజయలక్ష్మి కొత్త అవతారం ఎత్తారు. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కథానాయికగా కనిపించారు. ఆమె నటిస్తున్న సినిమాకి మావీరన్ పిళ్లై అనే టైటిల్ నిర్ణయించారు. కేఎన్‌ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్‌ఆర్. రాజా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రవివర్మ మ్యూజిక్, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ శుక్రవారం(ఏప్రిల్ 2,2021) విడుదల చేశారు.
విశేషమేమిటంటే మావీరన్ పిళ్లై చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్ గెటప్‌లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంతో వీరప్పన్ వారసురాలు సినీరంగంలో ఎలాంటి పేరును సంపాదించుకుంటారో చూడాలి.
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం వీరప్పన్ గురించి తెలుసు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్ ను ఎట్టకేలకు 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలు రూపొందాయి. కాగా వీరప్పన్‌కు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీలో చేరారు. ఇక రెండవ కూతురు విజయలక్ష్మి తమిళ్వురిమై పార్టీలో చేరారు.