IPL 2026 auction : వీడెవండీ బాబు.. 30ల‌క్ష‌ల‌తో అడుగుపెట్టి.. ఏకంగా 14 కోట్ల‌కు పైనే.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆట‌గాడిగా..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆల్‌రౌండ‌ర్, అన్‌క్యాప్డ్ ఆట‌గాడు ప్రశాంత్‌ వీర్ పై అబుదాబి వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction)కోట్ల వ‌ర్షం కురిసింది.

IPL 2026 auction : వీడెవండీ బాబు.. 30ల‌క్ష‌ల‌తో అడుగుపెట్టి.. ఏకంగా 14 కోట్ల‌కు పైనే.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆట‌గాడిగా..

IPL 2026 auction Prashant Veer Sold to CSK

Updated On : December 16, 2025 / 5:23 PM IST

IPL 2026 auction : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆల్‌రౌండ‌ర్, అన్‌క్యాప్డ్ ఆట‌గాడు ప్రశాంత్‌ వీర్ పై అబుదాబి వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోట్ల వ‌ర్షం కురిసింది. 30 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి అడుగుపెట్టిన అత‌డి కోసం ఫ్రాంఛైజీలు పోటీప‌డ్డాయి. చివ‌రికి అత‌డిని 14.20 కోట్ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో అత‌డు ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ అన్‌క్యాప్డ్ ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర‌, లెఫ్మార్ట్ స్పిన్న‌ర్ అయిన ప్ర‌శాంత్ వీర్ 30 లక్ష‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి అడుగుపెట్టాడు. అత‌డి కోసం ఫ్రాంఛైజీలు ల‌క్నో, ముంబై, ఆర్ఆర్, సీఎస్‌కేలు పోటీప‌డ్డాయి. తొలుత ల‌క్నో, ముంబైలు అతడి కోసం బిడ్ వేయ‌గా ఆ త‌రువాత సీఎస్‌కే, ఆర్ఆర్‌లు రేసులోకి వ‌చ్చాయి. మ‌ధ్యలో స‌న్‌రైజ‌ర్స్ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అత‌డి ధ‌ర చూస్తుండ‌గానే 5,8, 10, 12 కోట్లు దాటిపోయింది.

IPL 2026 auction : జమ్ము క‌శ్మీర్ ఆల్‌రౌండ‌ర్ అక్విబ్ నబీ దార్ పంట పండింది.. కోట్ల వ‌ర్షం..

అత‌డి ధ‌ర 12 కోట్లు దాటిన త‌రువాత ఆర్ఆర్‌ త‌ప్పుకుంది. స‌న్‌రైజ‌ర్స్‌, చెన్నై జ‌ట్లు హోరాహోరీగా పోటీ ప‌డ్డాయి. చివ‌రికి రూ.14.20 కోట్ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ అత‌డిని సొంతం చేసుకుంది.

IPL 2026 auction : న‌క్క‌తోక తొక్కిన ర‌వి బిష్ణోయ్‌.. స‌న్‌రైజర్స్‌తో పోటీప‌డి భారీ మొత్తానికి ద‌క్కించుకున్న రాజ‌స్థాన్‌

దేశ‌వాళీ క్రికెట్‌లో ప్ర‌శాంత్ వీర్ గొప్ప రికార్డేమీ లేదు. రెండు ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడ‌గా ఏడు ప‌రుగులు చేయ‌డంతో పాటు రెండు వికెట్లు తీశాడు. తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడ‌గా 112 ప‌రుగులు చేయ‌డంతో పాటు 12 వికెట్లు సాధించాడు. అయితే.. అత‌డు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ టీ20 లీగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఈ క్ర‌మంలో అత‌డి కోసం ఫ్రాంఛైజీలు పోటీప‌డ్డాయి