IPL 2026 auction : నక్కతోక తొక్కిన రవి బిష్ణోయ్.. సన్‌రైజర్స్‌తో పోటీపడి భారీ మొత్తానికి దక్కించుకున్న రాజస్థాన్
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction) టీమ్ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ భారీ మొత్తాన్ని దక్కించుకున్నాడు.
IPL 2026 auction Ravi Bishnoi Sold To RR,
IPL 2026 auction : అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో టీమ్ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ భారీ మొత్తాన్ని దక్కించుకున్నాడు. అతడిని రూ.7.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
IPL 2026 auction : అబ్బా.. జాక్ పాట్ కొట్టిన శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానా.. ఎన్ని కోట్లంటే..
Ravi Bishnoi is a ROYAL! 🩷
The spin wizard goes to @rajasthanroyals for INR 7.2 Crore 👏#TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/Ac4DU7TXRS
— IndianPremierLeague (@IPL) December 16, 2025
కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి అడుగుపెట్టిన భారత స్పిన్నర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. తొలుత ఆర్ఆర్, సీఎస్‌కే లు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో అతడి ధర 5 కోట్లకు చేరుకున్న తరువాత చెన్నై పోటీ నుంచి తప్పుకుంది. ఆ తరువాత అనూహ్యంగా సన్‌రైజర్స్ రేసులోకి వచ్చింది.
అతడి ధరను పెంచుకుంటూ వెళ్లింది సన్‌రైజర్స్. ఆఖరికి సన్‌రైజర్స్ తప్పుకోగా 7.20 కోట్ల మొత్తానికి రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
