IPL 2026 auction Ravi Bishnoi Sold To RR,
IPL 2026 auction : అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో టీమ్ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ భారీ మొత్తాన్ని దక్కించుకున్నాడు. అతడిని రూ.7.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
IPL 2026 auction : అబ్బా.. జాక్ పాట్ కొట్టిన శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానా.. ఎన్ని కోట్లంటే..
Ravi Bishnoi is a ROYAL! 🩷
The spin wizard goes to @rajasthanroyals for INR 7.2 Crore 👏#TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/Ac4DU7TXRS
— IndianPremierLeague (@IPL) December 16, 2025
కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి అడుగుపెట్టిన భారత స్పిన్నర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. తొలుత ఆర్ఆర్, సీఎస్‌కే లు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో అతడి ధర 5 కోట్లకు చేరుకున్న తరువాత చెన్నై పోటీ నుంచి తప్పుకుంది. ఆ తరువాత అనూహ్యంగా సన్‌రైజర్స్ రేసులోకి వచ్చింది.
అతడి ధరను పెంచుకుంటూ వెళ్లింది సన్‌రైజర్స్. ఆఖరికి సన్‌రైజర్స్ తప్పుకోగా 7.20 కోట్ల మొత్తానికి రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.