Mokshagna : బాలయ్య తనయుడు మోక్షజ్ఞ రీసెంట్ లుక్స్ చూశారా..? టీడీపీ ఎమ్మెల్యేతో మీటింగ్.. ఫొటోలు వైరల్..
ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ప్రకటించారు. ఈ సినిమా నుంచి మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు.(Mokshagna)
Mokshagna
Mokshagna : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడు, హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతుంది. ఫ్యాన్స్ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ప్రకటించారు. ఈ సినిమా నుంచి మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు.(Mokshagna)
ఆ తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ తో ఎంట్రీ ఇస్తాడని బాలయ్య పలుమార్లు చెప్పినా ఆ సినిమా గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పటికప్పుడు చర్చగానే మారుతుంది.
ఇక మోక్షజ్ఞ బయట చాలా తక్కువగా కనిపిస్తాడు. దీంతో ఎప్పుడు కనిపించినా మోక్షజ్ఞ లుక్స్ వైరల్ అవుతాయి. తాజాగా మరోసారి మోక్షజ్ఞ ఓ ఫంక్షన్ లో కనిపించి వైరల్ అవుతున్నాడు.

మోక్షజ్ఞ తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్లడంతో అక్కడ మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుని కలిసి మాట్లాడారు. ప్రత్తిపాటి పుల్లారావు మోక్షజ్ఞను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. ప్రైవేట్ ఫంక్షన్ లో మోక్షజ్ఞను కలిసాను, సినీ, కుటుంబ విషయాలు మాట్లాడాను అని చెప్పడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడిస్తాడో? ఏ సినిమాతో ఇస్తాడో చూడాలి..?
Also Read : 45 Official Trailer : ముగ్గురు కన్నడ స్టార్స్ ఒకే సినిమాలో.. ట్రైలర్ అదిరిందిగా..
View this post on Instagram
