Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం AK47 టీజ‌ర్ వ‌చ్చేసింది.. న‌వ్వులే న‌వ్వులు..

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టిస్తున్న ఆదర్శ కుటుంబం మూవీ టీజ‌ర్ (Aadarsha Kutumbam AK47) వ‌చ్చేసింది.

Venkatesh Aadarsha Kutumbam teaser out

Aadarsha Kutumbam AK47 Teaser: విక్టరీ వెంకటేష్ న‌టిస్తున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం’. హౌస్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌. నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తుండ‌గా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read – Bigg Boss Today Promo : సీక్రెట్ రూమ్‌లో చైత్ర‌, చ‌ర‌ణ్‌?.. హౌస్‌మేట్స్‌కు షాకిచ్చిన నాగార్జున‌.. మీరు అలా అనుకుంటే.. ప్రొమో అదుర్స్‌..

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.