Venky-Kalyan Ram: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాకు క్రేజీ టైటిల్ ఫిక్స్.. జనవరి 12 విడుదల.. క్యాప్సన్ ఏంటో తెలుసా?

విక్టరీ వెంకటేష్(Venky-Kalyan Ram), నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Venkatesh kalyan ram anil ravipudi movie title january 12 vidudala

  • అనిల్ రావిపూడి కొత్త సినిమా
  • వెంకీ కళ్యాణ్ కాంబో చిత్రం
  • జనవరి 12న గ్రాండ్ రిలీజ్

Venky-Kalyan Ram: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మొదటి నుంచీ విశేష ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. పూర్తిస్థాయి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి విభిన్నంగా టైటిల్‌ను ఖరారు చేశారు.

Cinema Ticket Prices: సినిమా ప్రేక్షకులకు షాక్.. పెరిగిన సినిమా టికెట్ ధరలు.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!

‘జనవరి 12 విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో’

ఈ చిత్రానికి “జనవరి 12 విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో(Venky-Kalyan Ram)” అనే ఆసక్తికరమైన, వింతైన టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. టైటిల్‌తోనే సినిమాలోని వినోదాత్మక కోణాన్ని స్పష్టం చేస్తూ ప్రమోషన్లలో కొత్తదనం చూపించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి చేసుకుందని, ప్రణాళిక ప్రకారమే ముగింపు దశకు చేరుకుంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తున్నారు. టైటిల్‌లో పేర్కొన్న విధంగానే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.