వెంకీ, విక్రమ్ వేదా చెయ్యట్లేదు : సురేష్ బాబు

విక్రమ్ వేదా తెలుగు రీమేక్ వార్తలపై స్పందించిన వెంకీ సోదరుడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు..

  • Publish Date - May 7, 2019 / 07:17 AM IST

విక్రమ్ వేదా తెలుగు రీమేక్ వార్తలపై స్పందించిన వెంకీ సోదరుడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు..

ఆర్.మాధవన్, విజయ్ సేతుపతి నటించగా తమిళ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, విక్రమ్ వేదా.. పుష్కర్- గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాధవన్ పోలీస్ ఆఫీసర్‌గా, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది కూడా.. కొద్ది కాలంగా ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో విక్టరీ వెంకటేష్ ఈ రీమేక్‌లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో, మాధవన్ క్యారెక్టర్‌లో నారా రోహిత్, విజయ్ సేతుపతి రోల్‌లో వెంకటేష్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.

రీసెంట్‌గా వెంకీ సోదరుడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఆ వార్తలపై స్పందించారు. వెంకటేష్ విక్రమ్ వేదా తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు. తను ప్రస్తుతం వెంకీమామ చేస్తున్నాడు. త్వరలో వెంకటేష్ తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తాం.. అని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.
 
 వాచ్ విక్రమ్ వేదా ట్రైలర్..