VV Rajkumar : వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’ నా లవ్ స్టొరీనే.. సీనియర్ యాక్టర్ కామెంట్స్..

Venkatesh Preminchukundam Ra is my love story Senior actor comments going viral
VV Rajkumar : ఒకప్పటి సీనియర్ యాక్టర్ వి వి రాజ్ కుమార్ ఇప్పటివారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఈయన ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించారు. విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన్ని అందరూ జూనియర్ చిరంజీవి అని పిలుస్తూ ఉంటారు. అనంతరం ఆయనకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు.
అయితే సీనియర్ యాక్టర్ రాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో యాంకర్ మాట్లాడుతూ.. మీ లవ్ స్టోరీనే ప్రేమించుకుందాం రా సినిమాగా తీశారంట కదా అని అడిగారు. దానికి రాజ్ కుమార్ సమాధానం ఇస్తూ అవును అది నా స్టోరీనే అని అన్నారు. ఈ సినిమా కంటే ముందు హైదరాబాద్ లో షిఫ్ట్ ల ప్రకారం పని చేసుకుంటూ బాగా బిజీగా ఉండేవాడిని. కానీ ఈ సినిమా నా లవ్ స్టోరీ అని తెలిసాక ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ అయిపోయింది.
Also Read : Ketika Sharma : ట్రెడిషినల్ డ్రెస్‌లో అందంగా తయారయి కవ్విస్తున్న కేతిక శర్మ..
ఈ మధ్యకాలంలో ఈ మూవీ డైరెక్టర్ కూడా కలిశారు. అప్పుడు కూడా అయన మాట్లాడుతూ.. అసలు ప్రేమించుకుందాం రా స్టోరీ అంటే నీదేనయ్యా అని అన్నారు. ఈ సినిమా స్టార్టింగ్ లో ఉన్న లవ్ సీన్స్ మాకు జరిగినవే. మేము ఎలా అల్లరి చేసాం, ఎలా కలిసాం అన్నది అంతా చాలా తమాషాగా ఉండేది. చాలా బాగా చూపించారు అంటూ తెలిపారు యాక్టర్ రాజ్ కుమార్.