‘మోసగాళ్ల’కు వెంకీమామ వాయిస్..
- sekhar
- Updated on- October 19, 2020 / 06:06 PM IST
Venkatesh – Mosagallu Movie: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.24 Frames Factory, AVA Entertainment బ్యానర్‌లపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది.
‘మోసగాళ్లు’ చిత్రానికి వెంకీమామ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈ సినిమా కథను వివరిస్తూ ఆరంభం నుంచి ముగింపు వరకు వెంకీ వాయిస్ సాగుతందట. మంచు విష్ణుతో పనిచేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందని వెంకీ ట్వీట్ చేశారు.
తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవదీప్, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Sam C. S. సంగీతమందిస్తున్నారు.
Always happy to work with you @iVishnuManchu ??❤️ https://t.co/LF6KA6FXaj
— Venkatesh Daggubati (@VenkyMama) October 16, 2020
