Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కొత్త రిలీజ్ డేట్ ఇదే..
Aadarsha Kutumbam : విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ఆదర్శకుటుంబం.
- Thota Vamshi Kumar
- Published on- October 20, 2026 / 02:24 PM IST
Venkatest Aadarsha Kutumbam new release date
Aadarsha Kutumbam : విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ఆదర్శకుటుంబం. హౌస్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దసరా సందర్భంగా ఈ చిత్ర కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబర్ 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. పలు కారణాల వల్ల ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఈ చిత్రం తొలుత అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9కి వాయిదా వేశారు. అయితే.. అప్పటికి కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. అయితే.. ఈ సారి ఖచ్చితంగా అక్టోబర్ 30కి ప్రేక్షకుల ముందుకు వచ్చి తీరుతాం అంటూ చెబుతున్నారు.
Manchu Manoj : దసరా రోజు మంచు మనోజ్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్..
ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. నారా రోహిత్, నివేదా పేతురాజ్, పూజిత పొన్నాడ, రావు రమేష్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ స్ర్కిప్ట్‌ని అందించారు. ఆ తరువాత వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
