×
Ad

Venu Swamy: అలా నేను మాట్లాడితే చంపేసేవారు.. శివాజీ ఇష్యూపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

శివాజీ ఇష్యూపై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి(Venu Swamy).

Venu Swamy shocking comments about actor Shivaji.

  • శివాజీపై వేణు స్వామి కామెంట్స్
  • నేను అలా మాట్లాడితే బ్రతకానిచ్చేవారు కాదు
  • అనసూయలా నేను మాట్లాడగలను

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) గురించి ప్రత్యేకమైం పరిచయం అవసరం లేదు. ప్రముఖులు, రాజకీయనాయకుల జాతకాలు చెప్తూ, వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా ఈయన తన నోటికి పని చెప్పాడు. మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ రీసెంట్ గా జరిగిన నటుడు శివాజీ ఇష్యూ గురించి ప్రస్తావించాడు.

Naga Chaitanya- Sobhita: అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంక్రాంతి వేడుకలు.. నాగ చైతన్య, శోభిత ఫొటోలు

అవే కామెంట్స్ తను చేసి ఉంటే తనను బ్రతకానిచ్చేవారు కాదు అంటూ చెప్పుకోచ్చాడు. ‘నటుడు శివాజీలా నేను మాట్లాడి ఉంటే నన్ను ఈపాటికి జైల్లో వేసేవారు. మీడియా ఛానల్స్ సైతం నన్ను టార్గెట్ చేసేవి. ఐక్యరాజ్యసమితి కూడా రంగంలోకి దిగేది. అసలు నన్ను బతకనిచ్చేవారు కాదు. నాగచైతన్య- శోభితలపై నేను చేసిన వీడియోకి చాలా టార్గెట్ చేశారు. అందుకే, ఇక్కడ అందరికీ సమానమైన న్యాయం జరగడం లేదు అనిపిస్తుంది.

ఇక అనసూయ గురించి ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పబ్లిక్ డొమైన్ లో పెట్టే ఏ ఫోటోపై అయినా మాట్లాడే హక్కు నాకు ఉంది. రాజ్యాంగం మీకు కల్పించిన హక్కులే మాకు కల్పించింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఆలా లేదు. ఇక్కడ రెండు ప్లస్ రెండు ఐదు అవుతుంది” అంటూ తన స్టయిల్లో కౌంటర్ ఇచ్చాడు. మరి వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీస్తాయా అనేది చూడాలి.