Venu Thottempudi: రవితేజ సినిమా చేయడం ఇష్టం లేదు.. ఎంత మొత్తుకున్నా వినలేదు.. చివరికి డిజాస్టర్ అయ్యింది

దర్శకుడు శరత్ మండువా పట్టుబట్టి వేణు(Venu Thottempudi)ను ఆ సినిమాలో నటించేలా చేశాడట.

Venu Thottempudi shocking comments on Ravi Teja Rama Rao on Duty movie

  • రవితేజ సినిమాపై వేణు వ్యాఖ్యలు.
  • ఇష్టం లేకున్నా నటించాల్సి వచ్చింది.
  • రామారావు ప్లాప్‌పై ఓపెన్ టాక్.

Venu Thottempudi: టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి తన సెకండ్ ఇన్నింగ్స్, సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘స్వయంవరం’ సినిమాతో వెండితెరకు పరిచయమై, తనదైన టైమింగ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన వేణు, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తరువాత ఆయన మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో ఆయన మళ్లీ వెండితెరపై మెరిశారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించడానికి తాను మొదట్లో అస్సలు ఇష్టపడలేదని వేణు బాహాటంగా వెల్లడించారు.

Anasuya Bharadwaj: బండి భగీరథ్ కేసుపై అనసూయ షాకింగ్ పోస్ట్.. వైరల్ అవడం కోసమే చేస్తావా.. నెటిజన్స్ ఫైర్

తాజా ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. దర్శకుడు శరత్ మండువా తనను ఈ పాత్ర కోసం సంప్రదించినప్పుడు తనకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. అందుకే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని, కానీ దర్శకుడు మాత్రం వదలకుండా తనను కలవాలని కోరారని తెలిపారు. “మీరు సినిమా చేయకపోయినా పర్లేదు, ఒక్కసారి కథ వినండి” అని ఆయన కోరడంతో వెళ్లానని, అక్కడ శరత్ చూపించిన పట్టుదల చూసి కాదనలేక ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని వేణు వివరించారు.

నిజానికి రామారావు ఆన్ డ్యూటీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో వేణు(Venu Thottempudi) ఆశించిన భారీ కంబ్యాక్ ఈ సినిమా ద్వారా లభించలేదు. అయినప్పటికీ, ఆ తర్వాత ఆయన ‘అతిధి’ వంటి వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వరుసగా సినిమాల్లో నటించడం కంటే, తనకు నచ్చిన, వైవిధ్యమైన పాత్రలు వస్తేనే కెమెరా ముందుకు రావాలని వేణు నిర్ణయించుకున్నట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టమవుతోంది. మరి రానున్న రోజుల్లో వేణు ఎలాంటి పాత్రలతో ఆడియన్స్ ను అలరిస్తారు అనేది చూడాలి.