Anasuya Bharadwaj: బండి భగీరథ్ కేసుపై అనసూయ షాకింగ్ పోస్ట్.. వైరల్ అవడం కోసమే చేస్తావా.. నెటిజన్స్ ఫైర్
బండి భగీరత్ పోక్సో కేసుపై షాకింగ్ పోస్ట్ పెట్టిన అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj).
Anasuya Bharadwaj shocking post regarding Bandi Bhageerath POCSO case.
- భగీరథ్ కేసుపై అనసూయ మౌనం.
- నిజం తెలిశాకే మాట్లాడతానన్న నటి.
- నెటిజన్ల ప్రశ్నలకు అనసూయ కౌంటర్.
Anasuya Bharadwaj: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, సామాజిక అంశాలపై ధైర్యంగా గళమెత్తే నటి అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) గత కొద్ది రోజులుగా మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ పోక్సో కేసుపై ఆమె ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు వరుసగా ప్రశ్నలు కురిపించారు. ప్రతి చిన్న విషయానికీ రియాక్ట్ అయ్యే అనసూయ, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా సైలెంట్‌గా ఉండటంపై విమర్శలు రావడంతో, ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన మౌనానికి గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
Bad Boy Karthik: OTTకి వచ్చేసిన ‘బాడ్ బాయ్ కార్తీక్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏదైనా విషయం ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు వెంటనే స్పందించడం చాలా సులభమని, కానీ దానివల్ల వచ్చే పర్యవసానాలను కూడా ఆలోచించాలని అనసూయ పేర్కొన్నారు. నిజానిజాలు అధికారికంగా బయటకు రాకముందే ఒకరిపై విమర్శలు చేయడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను కూడా వార్తలను గమనిస్తున్నానని, అయితే వాస్తవాలు తెలియకుండా చేసే వ్యాఖ్యలు ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు తప్పు చేసి ఉంటే చట్టం ఖచ్చితంగా శిక్షిస్తుందని, అంతవరకు ఓపికగా ఉండటం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఒక తల్లిగా, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా తాను మాట్లాడే ప్రతి మాటకూ విలువ ఉండాలని అనసూయ తెలిపారు. తనకు పూర్తి క్లారిటీ వచ్చినప్పుడే దీనిపై స్పందిస్తానని, తన మనసుకు ఏదైనా తప్పు అనిపిస్తే ఎంతటి వారినైనా ప్రశ్నించడానికి వెనకాడబోనని హామీ ఇచ్చారు. కేవలం వివాదాల కోసం లేదా వైరల్ అవ్వడం కోసం ఏదో ఒకటి మాట్లాడటం కంటే, నిజం తెలిసే వరకు వేచి చూడటమే ఉత్తమమని ఆమె చెప్పిన తీరు ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పరిణతితో కూడిన సమాధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
View this post on Instagram
