Bad Boy Karthik: OTTకి వచ్చేసిన ‘బాడ్ బాయ్ కార్తీక్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసిన నాగ శౌర్య లేటెస్ట్ మూవీ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్(Bad Boy Karthik)’.
Naga Shaurya Bad Boy Karthik movie ott streaming platforms
-
ప్రైమ్ వీడియోలో నాగశౌర్య సినిమా.
-
ఓటీటీలోకి బ్యాడ్ బాయ్ కార్తీక్.
-
నేటి నుంచే డిజిటల్ స్ట్రీమింగ్.
Bad Boy Karthik: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్(Bad Boy Karthik)’. రమేష్ దేశినా దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో విధి యాదవ్ హీరోయిన్గా నటించింది. సముద్రఖని ఒక కీలక పాత్రలో కనిపించగా ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
నెగిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నేటి నుండే అంటే మే 15 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా, ఇంటి వద్ద కూర్చుని చూసే ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.
Peddi: ‘పెద్ది’తో లాంగ్ డ్రైవ్.. రామ్ చరణ్, బుచ్చిబాబు స్పెషల్ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
