Katrina Kaif Fit Body : కత్రినా వర్కవుట్స్…వీడియో వైరల్
నటి కత్రినాకైఫ్ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రోజు వ్యాయామం చేస్తుంటారు. తాజాగా..జిమ్స్ లో ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో చేసిన వర్కవుట్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
- madhu
- Published On : September 19, 2021 / 01:06 PM IST
Katrina
Katrina Kaif Workout : సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు బాడి ఫిజిక్ విషయంల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం డైట్ తో పాటు..తప్పనిసరిగా కసరత్తులు చేస్తుంటారు. వారి ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జిమ్ లో కానీ..ఇతర జిమ్ లలో ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో వారు ఎక్సర్ సైజ్ లు చేస్తుంటారు. తాము ఎలా వర్కవుట్స్ చేస్తున్నామో అభిమానులకు తెలియచేసేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇవి చూసిన ఫాన్స్ వామ్మో..అనకమానరు.
Read More : Pitru Paksha 2021 : మంగళవారం నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం
బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రోజు వ్యాయామం చేస్తుంటారు. తాజాగా..జిమ్స్ లో ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో చేసిన వర్కవుట్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంత స్టన్నింగ్ ఉండటానికి కారణం ఇదేనా అంటూ..నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాను మనస్సుకు శిక్షణ ఇస్తాను..దానిని తన బాడీ ఫాలో అవుతుంది..లేదంటే…రెజా (ఫిట్ నెస్ ట్రైనర్) కు ఫోన్ చేస్తా అంటూ…క్యాప్షన్ జోడించారు. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారామె. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే…బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘టైగర్ – 3’ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మూవీ షూటింగ్ కొనసాగుతోంది.
