ప్రముఖ నటుడు, దర్శకుడు ఇమ్తియాజ్ ఖాన్ కన్నుమూత..

ప్రముఖ బాలీవుడ్ నటుడు, అమ్జాద్‌ఖాన్ సోదరుడు ఇమ్తియాజ్‌ ఖాన్ కన్నుముశారు..

  • Publish Date - March 17, 2020 / 06:55 AM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు, అమ్జాద్‌ఖాన్ సోదరుడు ఇమ్తియాజ్‌ ఖాన్ కన్నుముశారు..

బాలీవుడ్ నటుడు జయంత్ కుమారుడు, అమ్జాద్‌ఖాన్ సోదరుడు, ప్రముఖ నటుడు, దర్శకుడు ఇమ్తియాజ్‌ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ఇమ్తియాజ్‌కు భార్య కృతికా దేశాయ్ (ప్రముఖ రంగస్థల, టీవీ మరియు సినీ నటి), కుమార్తె అయేషా ఖాన్ ఉన్నారు.

ఇమ్తియాజ్ ‘యాదోంకి బారాత్’, ‘ధర్మాత్మ’, ‘దయావన్’, ‘హల్‌చల్’, ‘ప్యార్ దోస్త్’, ‘గ్యాంగ్’ తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఇమ్తియాజ్‌ ఖాన్ మృతికి సంతాపం తెలిపారు. ఇమ్తియాజ్‌ ఖాన్ నటునిగా, దర్శకునిగా మంచి పేరు సంపాదించారు. ఆయన మరణం హిందీ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ వారు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.

Read Also : సీనియర్ ఇక్కడ.. నాకు నేనే పోటీ.. నాకెవరూ రారు సాటి..

బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ, ఇమ్తియాజ్‌ ఖాన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ‘సీనియర్ యాక్టర్ ఇమ్తియాజ్‌ ఖాన్ కన్నుమూశారు. అతనితో ‘గ్యాంగ్’ సినిమాలో నటించాను. ఇమ్తియాజ్‌ ఖాన్ అద్భుతమైన నటుడు. మానవతావాది. భగవంతుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని’ అని ట్వీట్ చేశారు. 

ట్రెండింగ్ వార్తలు